నిహారిక విడాకులు.. వరుణ్ తేజ్ కు కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాటి తల్లి?
ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇక వీరిద్దరి విడాకుల విషయం ఇటీవలే ప్రకటించడంతో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే సినిమా వాళ్ళు అయితే ఇలాంటి వార్తలను చూసి చూడనట్లుగానే ఉంటారు. కానీ వారి కుటుంబీకులు మాత్రం ఈ వార్తలను కొన్ని కొన్ని సార్లు సీరియస్గా తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలను లావణ్య త్రిపాఠి తల్లి సీరియస్గా తీసుకుందట. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే కాబోయే అల్లుడు వరుణ్ తేజ్ కి ఒక కండిషన్ పెట్టిందట లావణ్య త్రిపాఠి తల్లి.
తన కూతురు జీవితం బాగుండడం కోసమే ఇక ఇలాంటి కండిషన్ పెట్టింది అన్నది తెలుస్తుంది. పెళ్లయిన తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి ఉంటే తన కూతురి జీవితం ఇబ్బందుల్లో పడుతుందని లావణ్య త్రిపాటి తల్లి భావించారట. ఈ క్రమంలోనే తన కూతురికి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పెళ్లయిన వెంటనే వరుణ్ తేజ్, లావణ్య వేరే కాపురం పెట్టాలని కండిషన్ పెట్టిందట. ముఖ్యంగా నిహారికతో కూడా పెద్దగా సంబంధాలు పెట్టుకోకూడదని కండిషన్ పెట్టారట ఆమె. ఈ కండిషన్లకు ఒప్పుకోవాలని.. అప్పుడే తన కూతురు జీవితం బాగుంటుందని ఇక ఇలాంటి నిర్ణయం తీసుకుందట. అయితే ఈ విషయం గురించి తెలిసి మెగా ఫ్యామిలీతో వేరు కాపురం అంటే ఓకే గాని.. నిహారికతో దూరం గా ఉండాలి అని చెప్పడం సమంజసం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.