బిగ్ బాస్ బ్యూటీ కీర్తి కాబోయే భర్త ఎవరో తెలుసా..?
అయిన వాళ్లందర్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన కీర్తి పెళ్లికి ముందే ఒక పాపని దత్తత తీసుకున్నా కూడా ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. బిగ్ బాస్ కి వెళ్లే కొద్ది రోజుల ముందు ఆ పాప కూడా మరణించింది. ఇక ఒక అమ్మాయి తల్లిగా మారడం కన్నా అద్భుతమైన క్షణం , అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పి ఎమోషనల్ అయిన కీర్తి ఆ అదృష్టం తనకు లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరగకా.. తనకు కూడా ఇక తల్లి అయ్యే అదృష్టం లేదని వెల్లడించి అందరి చేత కన్నీటిని పెట్టించింది. ఇలాంటి కీర్తిని అర్థం చేసుకొని ఇప్పుడు ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు.
ఇందులో భాగంగానే మాటీవీలో మా బోనాల జాతర ప్రోగ్రాంలో భాగంగా నటుడు విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన కీర్తి.. అదే వేదికపై అత్తమామలను కూడా పరిచయం చేసింది. అదే సమయంలో కీర్తిని తమ కుటుంబంలోకి కూతుర్ల ఆహ్వానిస్తున్నామని చెప్పి భావోద్వేగానికి గురైంది ఆమె అత్త. ఇకపోతే కీర్తి కాబోయే భర్త చిత్తూరు జిల్లా మదనపల్లిలో పెరిగి బెంగళూరులో చదివాడు. కన్నడ నాట కొరియోగ్రాఫర్ గా కెరియర్ ప్రారంభించి.. 2014లో సేడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఏబీ పాజిటివ్, చెడ్డి గ్యాంగ్, ఓ వెబ్సిరీ వంటి సినిమాలలో నటించారు. తమిళంలో కూడా డార్క్ నైట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.