ఇన్నేళ్ల కెరియర్లో.. కాజల్ కు నచ్చిన పాత్రలు అవేనట?
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకుంటున్న యంగ్ హీరోల సరసన కూడా నటించి అందరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది ఈ సొగసరి. అయితే ఇక సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంతు కేసరి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ భారతీయుడు 2 సినిమాతో కూడా బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇలా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే ఇటీవల ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన సమయంలో ఒక అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు మీరు సినిమాల్లో చేసిన పాత్రల్లో మీకు ఇష్టమైన రోల్ ఏంటో చెప్పాలని అడగగా.. నాలుగు పేర్లు చెప్పింది కాజల్ అగర్వాల్ . డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో తాను చేసిన నందిని, ప్రియా పాత్రలతో పాటు చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో మిత్రవిందా పాత్ర ఇక సత్యభామ పాత్ర కూడా తనకు ఎంతో ఇష్టం అంటూచెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. అయితే కుటుంబ బాధ్యతలు నేపథ్యంలో కాజల్ సినిమాలకు దూరం అవ్వబోతుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.