గేమ్ చేంజెర్ సినిమా విషయంలో ఫ్యాన్స్ నిరాశ..!!
ఈ సినిమా షూటింగ్ 80 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం శంకర్ ఇండియన్-2 చిత్రాన్ని పూర్తిచేసే పనిలో పడ్డట్లు సమాచారం .ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే రామ్ చరణ్ సినిమాని సెట్స్ మీదికి తీసుకువెళ్లబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్-2 చిత్రానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ఉదయనిది స్టాలిన్ తెలియజేయడం జరిగింది. ఇండియన్-2 చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయబోతున్న ఉదయం ఇది మాటల ద్వారా తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు తాజాగా గేమ్ చెంజర్ సినిమా పైన అభిమానుల కన్ఫ్యూజ్ ఏర్పడుతోంది. ఇండియన్-2 చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం మొదట భావించగ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియన్-2 సినిమా వేసవిలో రాబోతోందని తెలిసి గేమ్ చేంజెర్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా 80 రోజులు షూటింగ్ చేయవలసి ఉండగా వచ్చే ఏడాది వేసవికి పూర్తి అయిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఏ మేరకు ఈ సినిమాపై క్లారిటీ ఇస్తారు చిత్ర బృందం చూడాలి మరి.