వైష్ణవ్ తేజ్ కోసం రంగంలోకి దిగిన బడా నిర్మాత..!

Divya
సాధారణంగా మెగా హీరోలు అంటే కచ్చితంగా వారి సినిమాలు మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ లో టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారిలో నలుగురు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉండగా మెగా మేనల్లుళ్లు గా వచ్చిన సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారుతూ స్టార్ హోదా పొందే ప్రయత్నం చేస్తున్నారు.. అందులో భాగంగానే సాయి ధరంతేజ్ ఇటీవల విరూపాక్షా సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకోగా వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ఇక ఆ తర్వాత వైష్ణవ్ కు అనుకున్నంత రేంజ్ లో హిట్టు లభించడం లేదు. ఇక ఆయన ఇమేజ్ డౌన్ అయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనను స్టార్ హీరో ను చేసే పనిలో పడ్డారు అల్లు అరవింద్. బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన వైష్ణవ్ తేజ్ కి స్టార్ స్టేటస్ అందించడానికి భారీ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఏజెంట్ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైలమాలో ఉన్న నేపథ్యంలో ఆయనకు తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ తో కమిట్మెంట్ ఉంది అయితే పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు ఉన్న సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథను  వైష్ణవ తేజ్ తో చేయించాలని అల్లు అరవింద్ చూస్తున్నాడట. ఇక ఈ సినిమాని కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ కోసం భారీ యాక్షన్ సీన్లతో కూడిన కథను ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా గనుక హిట్ అయితే వైష్ణవ్ తేజ్ కెరియర్ మారిపోతుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: