ఈమె నాగార్జున, ప్రభాస్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

Purushottham Vinay
సిల్వర్ స్కిన్ పై ఒక వెలుగు వెలిగి తమ అందంతో అభిమానులని మాయ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అందులో కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి కూడా తమకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఒక్క మూవీతోనే మంచి స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతుంటారు. అలాంటి వారి లిస్టులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?. ఒక్క మూవీతోనే యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు అడియన్స్ మదిలో మాత్రం చెరగని ముద్ర వేసింది. ఆమె అన్షు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టమే. కానీ నాగార్జున నటించిన మన్మథుడు హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకులకు తన పాత్రతో కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో నటించింది కొద్ది సేపే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసింది.


అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది అన్షు. మొదటి మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అన్షు ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఆమె అమాయకత్వం ఇంకా ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ అయిన అన్షుకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. కేవలం ఆమె ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక అన్షు కోలీవుడ్ లో నటించిన చివరి మూవీ జై.అయితే ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో.. హీరోయిన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను 2003లో పెళ్లి చేసుకుని ఇక అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: