నందమూరి కుటుంబం నుండి ఎంట్రీ ఇవ్వబోతున్న మరొక హీరో....!!
మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు నందమూరి జయకృష్ణ పేరు నిర్మాతగా ఉండగా వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.నందమూరి చైతన్య కృష్ణకు జోడీగా ఈ సినిమాలో వైదిక సెంజలియా నటించారు. చైతన్య కృష్ణ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. నందమూరి చైతన్య కృష్ణ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతన్య కృష్ణకు నందమూరి హీరోలు సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.