దర్శకుడు టి కృష్ణ వారసుడువాసిని ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మ్యాచ్ హీరో గోపీచంద్ తొలివలపు సినిమాతో హీరోగా తన సినీ కెరియర్ ప్రారంభించాడు . ఇక మొదటి సినిమా నిరాశపరిచినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు గోపీచంద్. ఇక మొదటి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో గోపీచంద్ వైపు ఎవరో చూడలేదు. ఇక అలాంటి క్లిష్టమైన సమయాల్లో విలన్ గా గోపీచంద్ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇండస్ట్రీలో నిలతొక్కుకునేందుకు జయం సినిమాతో విలన్ పాత్రలో నటించి అందరికీ ఊహించిన షాక్ ఇచ్చాడు.
ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా నిజం వర్షం వంటి సినిమాలో వరసగా విలన్ పాత్రలు చేసే అవకాశాలు గోపీచంద్ కి వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా విలన్ గా కొనసాగుతున్న సమయంలో అందరూ అతని విలన్ గా నే ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడు అనే అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా యజ్ఞం సినిమాతో హీరోగా తిరిగి వచ్చాడు. ఏ ఎస్ రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమీరా బెనర్జీ హీరోయిన్గా నటించిన బాబు రావు నిర్మించిన ఈ సినిమాకు మరదత్నం స్వరాగాలు అందించారు.
2004లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ యాక్షన్ సీన్స్ సమీరా అందచందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ సినిమాతో గోపీచంద్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు గోపీచంద్ .అయితే మొదటగా ఈ సినిమాను గోపీచంద్ కోసం అనుకోలేదట దర్శకుడు. గోపీచంద్ కంటే ముందే ఈ సినిమాను టాలీవుడ్కు చెందిన ఇద్దరు హీరోల దగ్గరకు తీసుకెళ్లారట.కానీ వారు నో చెప్పడంతో ఈ సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాడు.ఇక ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరోలు మరెవరో కాదు ప్రభాస్ కళ్యాణ్ రామ్ .ఇక వీరిద్దరూ అప్పుడే సినీ కెరియర్లో హీరోలుగా నిలదొక్కుకుంటున్నారు. అలాంటి సమయంలో కొత్త దర్శకుడు తో సినిమా చేయడం కష్టమని అనుకొని ఈ సినిమాకి నో చెప్పారట..!!