'ఆదిపురుష్ ' మూవీ గూర్చి సంచలన వ్యాఖ్యలు చేసిన గోగినేని....!!
రామాయణం ఎక్కడైతే పారాయణం చేయబడుతుందో అక్కడ హనుమంతుడు తప్పకుండా వస్తారని మన నమ్మకం.అందుకే ప్రతి థియేటర్లోనూ ఒక సీటు కేటాయించాలని సూచించారు.ఇలా ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సినిమా హాల్ ని గుడిగా మార్చేస్తున్నారు.దీనికి మీకు పర్మిషన్ ఉందా ? సినిమా చూడడానికి వచ్చిన వారికీ కొబ్బరి కాయలు కొట్టే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారా ? అంటూ విమర్శలు చేశారు.
ఇకపోతే పీరియడ్స్ ఉన్న మహిళలు ఆది పురుష్ సినిమా చూడవచ్చా? ఇలాంటివారు సినిమా గుడిగా భావించే థియేటర్లోకి అడుగు పెట్టవచ్చా? అలాగే సినిమా థియేటర్లో పాప్ కార్న్ కు బదులు ప్రసాదాలు, అన్నదానాలు ఏర్పాటు చేయండి.అలాగే ప్రతి థియేటర్ వద్దకు ఒక పురోహితుడిని, ఆవుని తీసుకురావడమే కాకుండా ఒక హుండీని కూడా ఏర్పాటు చేయండి అంటూ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ విమర్శలు కురిపించారు.అలాగే రాహుకాలంలో ఈ సినిమా ప్రసారమైతే పరిస్థితి ఏంటి? సరైన సమయం చూసుకున్నారో లేదో అంటూ కూడా ఈయన ఈ సినిమా పట్ల విమర్శలు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.