ఆ దర్శకుడు చెప్పిన కథకు ఫ్లాట్ అయిన ప్రభాస్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లోను ... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే మూవీ లోను ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లోను హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్నా ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాలు నడప విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది.

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ప్రభాస్ టి మూవీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ దర్శకుడు ప్రభాస్ కు ఒక కథను వినిపించాడట ... ఆ కథ అద్భుతంగా నచ్చడంతో ప్రభాస్ ఈ దర్శకుడు తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ... హను రాగవపూడి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: