100 కోట్లతో మోహన్ బాబు సినిమా.. స్టోరీ కూడా రివీల్..?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా అలాగే నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇప్పుడంటే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ 80,90 దశకాల్లో ఆయన సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సినిమాలు భారీ కలెక్షన్స్ ని అందుకునేవి. అందుకే ఆయనకి కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా వచ్చింది. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ లోనూ భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు మోహన్ బాబు.

 కానీ గత రెండు దశాబ్దాలుగా ఈ సీనియర్ హీరోకి ఏమాత్రం కలిసి రావడం లేదు. నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. అటు మోహన్ బాబు వారసులు కూడా అదే విధంగా ఇండస్ట్రీలో విఫలమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా  విష్ణు సినిమాలు అయితే కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి రాబట్టలేకపోతున్నాయి. ఇటీవల విడుదలైన 'జిన్నా' సినిమా కూడా మంచు వారబ్బాయికి భారీ నిరాశనే మిగిల్చింది. ఆఖరికి సన్నీ లియోన్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. ఇక మరో మంచు హీరో మనోజ్ అయితే కెమెరా ముందుకు వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. రీసెంట్ గానే మనోజ్ బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు.

అందులో ఓ ప్రాజెక్ట్ ఇటీవల షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. మరొకటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మంచు లక్ష్మి కూడా అడపాదనప సినిమాల్లో కనిపిస్తుంది తప్పితే ఆమెకి ఓ బలమైన పాత్ర పడటం లేదు. ఇలాంటి సమయంలో మోహన్ బాబు ఏకంగా 100 కోట్ల ప్రాజెక్ట్ ని ప్రకటించి అందరికీ భారీ షాక్ ఇచ్చాడు. మంచు విష్ణు సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. అంతేకాదు ఈ సినిమా ప్లాట్ ఎలా ఉండబోతుందో ముందే రివీల్ చేశాడు మోహన్ బాబు. ఆయన చెప్పిన దాని ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ, అక్కడి స్టూడెంట్స్ చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా స్టార్ట్ చేసినట్లు మోహన్ బాబు తాజాగా తెలియజేశాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారట. మరి ఈ సినిమా అయినా అటు నటుడిగా మోహన్ బాబుకి నిర్మాతకు మంచి విష్ణుకు సక్సెస్ ని అందిస్తుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: