నాకు పెళ్ళి ఇష్టం లేదు.. కానీ పిల్లలు కావాలి : సల్మాన్ ఖాన్

praveen
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా కూడా అది సెన్సేషన్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతో మంది స్టార్ హీరోలు పర్సనల్ లైఫ్ కి సంబంధించి విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి విషయాలు అటు సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి అని విషయం తెలిసిందే.



 అయితే ఎప్పుడు సినిమా హీరోలకు సంబంధించిన పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోతూనే ఉంటాయ్. ఎవరైనా హీరోలు వయసు మీద పడిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటే చాలు అందరూ వారి గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇలా ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా కొనసాగుతున్న హీరో ఎవరు అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పే మాట సల్మాన్ ఖాన్ అని. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. 50 ఏళ్ల వయస్సు దాటిపోతున్న పెళ్లి అనే ఆలోచన చేయడం లేదు.


 ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడు తప్ప అటు పెళ్లి గురించి మాత్రం అస్సలు ఆలోచించడం లేదు అని చెప్పాలి. ఇదే విషయంపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తన కు పిల్లలు అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు  అయితే పెళ్లి చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు అంటూ తెలిపాడు. సల్మాన్ ఖాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుంటానో లేదో తెలియదు. కానీ భార్య లేకుండా తండ్రి కావాలని ఉంది. ఇందుకు భారతీయ చట్టాలు అస్సలు అంగీకరించవు. సరోగసి ద్వారా నిర్మాత కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలను పొందారు. అయితే ఇక రానున్న రోజుల్లో అయినా ఇక్కడి చట్టాలు మారతాయో లేదో చూడాలి మరి అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: