రామ్ చరణ్ పై.. ఉపాసన రివెంజ్.. వైరల్ వీడియో?
ఇక అప్పుడప్పుడు రామ్ చరణ్ ఉపాసనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న ఉపాసన తల్లి కాబోతుంది అన్న వార్త తెలియడంతో ఇక మెగా అభిమానులు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఉపాసన ఏకంగా రాంచరణ్ పై రివెంజ్ తీర్చుకున్న ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అంతకుముందు ఏకంగా ఉపాసనను రామ్ చరణ్ ఆటపట్టిస్తూ ఏకంగా తన పక్కన ఉన్న సోఫాలోంచి లేపి మరో పక్కన కూర్చోబెట్టాడు.
దీంతో బాగా హార్ట్ అయినా ఉపాసన ఏకంగా రామ్ చరణ్తో ఇంటి పనులు అన్నీ చేయించింది. అయితే ఇదంతా నిజంగా జరగలేదు. కానీ అభిమానులు మాత్రం రెండు వీడియోలను ఒకచోట కలిపి ఏకంగా రామ్ చరణ్ చేసిన దానికి అటు ఉపాసన రివెంజ్ తీర్చుకుంది అన్నట్లుగా అర్థం వచ్చేలా ఒక వీడియోని ఎడిట్ చేయగా.. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి అభిమానులు అందరూ కూడా బాగా నవ్వుకుంటున్నారు. ఇక ఉపాసనా వదిన రామ్ చరణ్ అన్నపై బాగా రివేంజ్ తీర్చుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.