కొరటాలతో వివాదం గురించి.. స్పందించిన చిరంజీవి?

praveen
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన  వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి ఊహించని రెస్పాన్స్ సాధిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇక ఈ సంక్రాంతికి అటు మెగాస్టార్ చిరంజీవి హిట్టు కొట్టినట్లే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా కీలకపాత్రలో నటించడంతో ఈ సినిమాకు అటు మాస్ మహారాజా అభిమానులు సైతం తరలి వెళ్తున్నారు.


 మరోసారి చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో ఉన్న సీన్లను తిలకించి మైమరిచి పోవాలని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే సినిమా విడుదలకు ముందు వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్స్ లో ఎంత బిజీ బిజీగా మారిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవినె దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాప్ గురించి ఇక కొరటాల శివ తో వివాదం ఉన్నట్లు వచ్చిన ప్రచారం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి.


 గత ఏడాది భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలకపాత్రలో నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.  అయితే దర్శకుడు నిర్ణయం ప్రకారమే సినిమా చేసాం అన్నట్లుగా చిరంజీవి స్పందించి అబాండం మొత్తం ఇక కొరటాల మీదే వేసేశాడు. దీంతో కొరటాలకి మెగాస్టార్ కి మధ్య వివాదం కొనసాగుతుందంటూ ప్రచారం జరగగా.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు మెగాస్టార్. నేను కేవలం కొరటాల శివ ని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికి దర్శకులకు పని విధాన్ని ఉద్దేశించి మాట్లాడాను. అనవసరంగా కొరటాల శివకు నాకు మధ్య వివాదాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ మెగాస్టార్ అన్నారు.

 ఇక సినిమా స్క్రిప్ట్ బడ్జెట్ అన్నీ ముందు ప్లాన్ చేసుకుని సినిమా మొదలుపెట్టాలి. సినిమా బడ్జెట్ అనేది దర్శకుడు చేతుల్లోనే ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నట్లుగా ఉంటాడు.  కాబట్టి నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను అంటూ తెలిపాడు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: