విన్నర్ అతనే..ఎవరో క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్..!?

Anilkumar
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఆఖరి దిశకు చేరుకుంది. ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టేసింది. ఎందుకంటే ఎవరో తెలియని సోషల్ మీడియా మొహాలను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా తీసుకోవడమే. దీంతో చాలామంది ఈ సీజన్ ను అంతగా ఇష్టపడడం లేదు. దీంతో ఈ సీజన్ టిఆర్పి రేటింగ్ కూడా చాలా తగ్గింది అని చెప్పాలి. అయితే ఈ సీజన్లో ప్రేక్షకులు చూసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం చాలానే కష్టపడుతుంది అని చెప్పాలి. అయితే అందులో భాగంగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాంటెస్టెంట్లను

 ఎలిమినేట్ చేసి వారం వారం ఎంతో ఆస క్తిగా చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ షో టిఆర్పి రేటింగ్ బాగానే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఇంకో వారం గడిస్తే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలలోకి ఎంటర్ అవుతుంది. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే వచ్చే డబ్బులు నుండి ఇప్పటికే దాదాపు 8 లక్షల రూపాయల వరకు తీసేయడం జరిగింది .గత సీజన్లో చూసుకుంటే గనక విన్నర్ కి మరియు రన్నర్ కి కూడా సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే .అయితే ఈసారి ఇది విన్నర్ కి మాత్రమే ఇస్తారా లేదా రన్నర్ కి కూడా ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది .

అయితే ఇటీవల నాగార్జున విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ తో పాటు సువర్ణభూమి వారు 25 లక్షల విలువ చేసే ఒక ప్లాట్ ని కూడా ఇస్తారు అని చెప్పడంతో హౌస్ మేట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో ఏడుగురు ఉన్నారు. అందులో ఆరుగురు నిలుచుని చప్పట్లు కొడుతుంటే ఆ ఆరుగురి మధ్యలో రేవంత్ కళ్ళు మూసుకొని నిల్చోని థాంక్స్ అన్నట్లుగా దండం పెడుతూ మనందరికీ కనిపిస్తున్నాడు మిగిలిన 6 ఇంటి సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటే మరికొంతమంది విన్నర్ అయ్యే అవకాశాన్ని వదులుకున్నామే అంటూ మొహంలో ఏదో తెలియని బాధతో కనిపించారు. కానీ రేవంత్ మాత్రం ఇందులో దండం పెడుతూ కనిపించడంతో ఈసారి కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని అంటున్నారు .ఇక బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ అవుతాడా లేదా అన్నది చూడాలి దీంతో ఈ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: