మాస్ డైరెక్టర్ నుంచి రెండు మాస్ సీక్వెల్ లు?

Purushottham Vinay
టాలీవుడ్ మాస్  డైరెక్టర్  అయిన బోయపాటి శ్రీను గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన 'అఖండ' సినిమాతో మళ్ళీ తానేంటో ప్రూవ్  చేసుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. బాల కృష్ణ కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్  బస్టర్  హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్  కూడా రాబోతుంది. గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ ప్రస్తావన మీడియా తీసుకొచ్చినప్పుడు బాల కృష్ణ చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న బోయపాటి శ్రీను మాత్రం తప్పకుండా సీక్వెల్ ఉంటుందనే హామీ ఇవ్వడం జరిగింది.ఇక దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట.అలాగే బోయపాటి శ్రీను తాను చేసిన మరో సినిమాకి కూడా సీక్వెల్ తీయనున్నాడని సమాచారం తెలుస్తుంది. అయితే ఆ సినిమా ఏంటో ఇంకా కన్ఫర్మ్ గా తెలీదు కానీ.. ఖచ్చితంగా బోయపాటి అఖండతో పాటు మరో సినిమాకి సీక్వెల్ ని తియ్యాలని ఫిక్స్ అయ్యాడట.ఇక ప్రస్తుతం బాల కృష్ణ 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్నారు.


ఈ సినిమా సంక్రాంతికి పండుగకి రిలీజ్ కానుంది. ఇక ఆ తరువాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయబోతున్నారు బాలయ్య. 2023 వేసవిలోపు అనిల్ రావిపూడి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత బాలకృష్ణ తన 'ఆదిత్య 999' ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాతో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నారు బాల కృష్ణ. ఇక ఈ సినిమాను బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేయనున్నారు.ఇక 2023లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారు కానీ ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా సమాచారం అయితే తెలియడం లేదు. బహుశా 2024లో ఈ సినిమాను మొదలుపెట్టే ఛాన్సులు ఉన్నాయి.ఈలోపు 'అఖండ2' సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను.ఇప్పుడు ఆయన రామ్ హీరోగా ఓ సూపర్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమా కంప్లీట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: