సరోగసీ పద్దతి ద్వారా పిల్లలు కావాలంటున్న హన్సిక ..!!
ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా హన్సిక పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే హన్సిక తన పెళ్లి విషయంలో అచ్చం నయనతార లాగే పెద్ద తప్పు చేయబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే నయనతార పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో మనం చూస్తూనే ఉన్నాం.
ఇక అలాంటి తప్పే హన్సిక కూడా చేయబోతుందట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హన్సిక డిసెంబర్ 4వ తేదీన అంగరవంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఛానల్ నుండి న్యూస్ వైరల్ బాగా అవుతుంది. డిసెంబర్ 2 నుండి హన్సిక పెళ్లికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయని, అదే రోజు రాత్రి సూఫీ నైట్ నిర్వహిస్తారని, ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మెహందీ, అలాగే సంగీత్ కార్యక్రమాలు కూడా ఉంటాయని సదరు ఛానల్ చెప్పుకొచ్చింది అమే. అలాగే డిసెంబర్ 4వ తేదీన హన్సిక కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటుందట. అంతేకాదు పెళ్లికి స్టార్ సెలబ్రెటీలను ఎవ్వరిని ఆహ్వానించడం లేదని మనకు తెలుస్తోంది.
కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తాను ప్రేమించిన ప్రియుడుతో పెళ్లి జరబోతోంది అని వార్తలు గటుగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియో కానీ, ఫోటోలు గాని సోషల్ మీడియాలో లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట ఈ నటి. ఇక ఈ విషయంలో హన్సిక అచ్చం నయనతారనే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నయనతార కూడా తన పెళ్లికి సంబంధించిన అన్ని పనులను సీక్రెట్ గా ముగించుకొని పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందుల్లో పడుతుందో మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు హన్సిక కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతుంది. మరి హన్సిక జీవితం పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ