డిసెంబర్ ఈ ఏడాది టాలీవుడ్ కలిసొచ్చేనా!!

P.Nishanth Kumar
పోయిన సంవత్సరం డిసెంబర్ నెల టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంతో బాగా కలిసి వచ్చింది. భారీ విజయాలను తెచ్చిపెట్టింది. అందుకే ఈ ఏడాది డిసెం బర్ అదే రకమైన విజయాలను తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకు వస్తుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా డిసెంబర్ లోనే విడుదల అయింది. ఆ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వ రూపం చూపించి ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయేలా చేశారు ఆ విధంగా అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో జరిగింది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ డిసెంబర్ 17వ తేదీన అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

 సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందరిని వేరే స్థాయిలో ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సినిమా యొక్క రెండవ భాగం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల లాగానే డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే భారీ సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయా అనేది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ద సినిమా అంటే రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా అని చెప్పాలి. ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుంది. అంతకుముందు ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.  ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా డిసెంబర్ లో రావడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలు డిసెంబర్ నెల సెంటిమెంట్ ను కొనసాగిస్తాయా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: