టాలీవుడ్ లో అగ్ర కథానాయకగా ఉన్న కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం ద్వారా తనకు వచ్చిన క్రేజ్ ను దాదాపుగా కోల్పోయిందని చెప్పాలి. మహానటి సినిమాతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయిన ఈమె ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలను వరుసగా చేయడం మొదలు పెట్టింది. అయితే ఆ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఫ్లాప్ ఇమేజ్ తీసుకు రావడంతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ ను కూడా తగ్గించింది. దాంతో కాస్త ఆలస్యం అయినా కూడా కీర్తి సురేష్ జాగ్రత్త పడి కమర్షియల్ సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించింది.
ఆ విధంగా ఇటీవల సర్కారు వారి పాట సినిమా తరువాత ఆమె మరిన్ని కమర్షియల్ సినిమాలలో నటిస్తూ ఉండడం విశేశం. మొదటి నుంచి గ్లామర్ షో చేయడానికి ఎక్కువగా ఇష్టపడని కీర్తి సురేష్ ఇప్పుడు అలాంటి పాత్రలు చేయడానికి ముందుకు వస్తుంది. తెలుగులో గ్లామర్ హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా ఆ విధంగా మారిపోయింది అని తెలుస్తుంది. ఫైనల్ గా కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో మంచి హిట్స్ ఇచ్చిన కూడా ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు పెద్దగా రావడం లేదని చెప్పాలి.
చాలామంది పూర్వ హీరోయిన్లు పెద్ద సినిమాలలో కూడా నటిస్తూ ఉండడం కీర్తి సురేష్ దాదాపుగా తగ్గిపోవడంతోనే ఈ విధమైన పరిస్థితి ఆమెకు ఏర్పడింది అని చెబుతున్నారు ఏదేమైనా కీర్తి సురేష్ ఇలాంటి అవకాశాన్ని కోల్పోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది ప్రస్తుతం కొంతమంది యువ హీరోలతో కలిసి నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాల ద్వారా మంచి విజయాన్ని అందుకుంటున్న అనేది చూడాలి. ఆమె కెరియర్ మునుపటిలా బాగా ముందుకు పోవాలి అంటే తప్పకుండా ఒక భారీ విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకోవాల్సిందే.