భార్య కోసం మహేష్ ఆ వ్యాపారంలోకి...?

murali krishna
సినిమాల్లో సంపాదించింది జాగ్రత్త గా పెట్టుబడి పెడితే ఆ సినీ ప్రముఖు ల వృద్ధాప్యం భావి జీవితాలు భద్రంగా ఉంటాయి. అలానే చేశారు కాబట్టే ఓ శోభన్ బాబు, మురళీ మోహన్ లు తరగని ఆస్తులతో మునిమనవ లు తిన్నా తరగని సంపదను పోగేశారట..

సినిమాల్లో సంపాదించింది భూములు, ఆస్తులు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టి ఇప్పుడు సినిమాల్లో నటించకున్నా.. ఆదాయం లేకున్నా కోటీశ్వరులుగా ఉన్నారు. సంపాదించిందం తా వృథా చేసిన మహానటి సావిత్ర నుంచి నేటి కొందరు తారల వరకూ రోడ్డున పడ్డారట.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల ని అంటుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారట హీరో మహేష్ బాబు.



తనకు సినిమాలు, యాడ్స్ ద్వారా వచ్చే కోట్లను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు మహేష్ బాబు.. రియల్ ఎస్టేట్(భూములు, ఆస్తులు కొనడం)తోపాటు మంచి సినిమాలు కూడా నిర్మించడం.. ఫ్యాషన్ రంగం, థియేటర్ పరిశ్రమలోకి మళ్లిస్తున్నాడు. అలా ఎప్పుడూ తన చేతికి డబ్బులు వచ్చేలా చూసుకుంటున్నాడు.

హీరోగానే కాదు.. వ్యాపారవేత్తగానూ మహేష్ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సరికొత్త వ్యాపారాన్ని మహేష్ బాబు ప్రారంభించబోతున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న బిజినెస్ లతోపాటు హోటల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మహేష్ బాబు సిద్ధమైనట్టు సమాచారం. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ పేరుమీద ఈ హోటల్స్ ప్రారంభించనున్నార ట.. ఈ హోటల్స్ కు 'మినర్వా ఏఎన్' అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని.. అతిత్వరలోనే హోటల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

 

సంపాదన ను అంతా ఇలా జాగ్రత్తగా వివిధ వ్యాపారాల్లో మళ్లిస్తూ తన భావిజీవితానికి అడుగులు వేసుకుంటున్నారు సూపర్ స్టార్. అలాగా తన వ్యాపారా ల ద్వారా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారట. పలువురు మంచి రచయితలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: