ఎలిమినేట్ అవుతూ తన ప్రేమను బయట పెట్టిన అర్జున్ కళ్యాణ్...!!

murali krishna
బిగ్ బాస్ హౌస్లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఏడవ వారం అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ ఇంటిని వేదిలెళ్ళిపోయాడు. ఏకంగా 13 మంది ఇంటి సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారట.

వారిలో ఒక్కొక్కరిగా సేవ్ అవుతూనే వచ్చారు. చివర్లో వాసంతి, అర్జున్ కళ్యాణ్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో… చిచ్చుబుడ్డి తేల్చేస్తుందని హోస్ట్ నాగార్జున చెప్పాడట.. వాసంతి, అర్జున్ ఫోటోలు ఉన్న చిచ్చుబుడ్లు వేదికపైకి తెచ్చిన నాగార్జున.. వెలిగి పూలు చిమ్మినవారు సేఫ్, వెలగని వారు ఎలిమినేటెడ్ అన్నాడు. వాసంతి ఫోటో ఉన్న చిచ్చు బుడ్డి పూలు చిమ్మింది. దీంతో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లు అయితే నాగార్జున ప్రకటించారు.


అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ శ్రీసత్యను ఆవేదనకు గురిచేసిందట.. కన్నీళ్లు వస్తుంటే ఆపుకోవడానికి ట్రై చేసింది. ఎవరు ఎలిమినేటై వెళ్ళిపోయినా ఏడవను అన్నావు, అర్జున్ వెళుతుంటే ఏడుస్తున్నావని పక్కన ఉన్న ఇంటి సభ్యులు శ్రీసత్యను అడిగారట.. ఇక వేదికపైకి వచ్చిన అర్జున్ కళ్యాణ్… శ్రీసత్య గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఆమె ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తున్నావని అర్జున్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట.. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

అసలు తాను బిగ్ బాస్ హౌస్ కి రావడానికి కారణమే శ్రీసత్య అని చెప్పాడు. ఇప్పటి వరకు ఈ విషయం శ్రీసత్యకు కూడా చెప్పలేదు అన్నాడు. నా సినిమాలో ఓ ఆఫర్ ఉందని శ్రీసత్యకు చెప్పడానికి ఫోన్ చేస్తే… తాను బిగ్ బాస్ షోకి వెళుతున్నట్లు తెలిసింది. దాంతో నేను బిగ్ బాస్ షోకి అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ కాల్ చేసి శ్రీసత్యకు చెప్పానని అర్జున్ అసలు సీక్రెట్ బయటపెట్టాడట.. హౌస్లో శ్రీసత్యకు అర్జున్ దగ్గర కావడం వెనుక పెద్ద ప్రణాళికే ఉందని రుజువైంది. శ్రీసత్యపై ఇష్టంతోనే షోకి వచ్చానని అర్జున్ చెప్పకనే చెప్పాడట..



వెళుతూ వెళుతూ శ్రీసత్యను బాగా ఆడాలని ప్రోత్సహించాడు. మీ పేరెంట్స్ ని నేను కలుస్తాను, మాట్లాడతాను. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. బాగా ఆడు బయట విషయాలు నేను సెట్ చేస్తానని అర్జున్ చెప్పుకొచ్చాడట.. శ్రీసత్యకు మద్దతుగా అర్జున్ భారీ క్యాంపు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అర్జున్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాస్తాయో చూడాలి. అర్జున్ పై శ్రీసత్యకు కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉందని నిన్న ఎపిసోడ్ తో రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: