సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉన్నవారికి ఎంతో వ్యాల్య ఉంటుంది. అలాంటి వారికి సినిమా అవకాశాలతో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పాలి. ఎవరైనా హీరోయిన్ సక్సెస్ సాధిస్తే ఆమెకు లక్కీ హ్యాండ్ అనే పేరు వస్తుంటుంది. లేదంటే ఆమె ను ఐరన్ లెగ్ అని సంబోధిస్తూ ఆమెను ఎంతగానో అవమాన పరుస్తూ ఉంటారు.
ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్లను ఆ విధంగా పిలిచి వారు మళ్ళీ సినిమాలి చేయకుండా చేశారు కూడా. ఆ విధంగా సక్సెస్ అనేది ఎంత ముఖ్యమైనదో దీన్ని బట్టి చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనీ హీరోయిన్లలో చాలా తక్కువ అదృష్టం కలిగి ఉన్న హీరోయిన్ రాశి కన్నా అనే చెప్పాలి. ఎందుకంటే ఈమెకు ఇప్పటివరకు చేసిన సినిమాలలో సక్సెస్ రేటు కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలేవి లేవని చెప్పాలి. ఇప్పటివరకు చాలా సినిమాలే చేసినా కూడా ఆమె గత రెండు మూడు సినిమాలు కూడా భారీ పరాజయం పొందడంతో ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదని చెప్పాలి. దానికి తోడు ఆమె హీరోయిన్ గా చేసి న కొన్ని సినిమాలు మధ్యలో నే ఆగిపోవ డం కూడా జరిగిపోతూ ఉండడం ఆమె కెరియర్ పై చాలా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. శర్వానంద్ హీరోగా నటించిన ఓ సినిమాలో హీరోయిన్గా రాసి కన్నా ఎంపిక అయింది అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడం ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది అని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు ఆమెను మళ్లీ ట్రాక్లోకి తీసుకువచ్చే సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని యంగ్ హీరోల సినిమాలు ఉన్నాయి.