బాహుబలిని కాపీ కొట్టిన హాలీవుడ్ సంస్థ...!!

murali krishna
తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేలా చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సాధించిన ఉత్సాహంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయగా, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మన సినిమాలపై హాలీవుడ్ మేకర్స్ ఓ కన్నేయడం కూడా మొదలు పెట్టారు. అక్కడితే ఆగలేదు. రాజమౌళి ఊహా శక్తి నుంచి వచ్చిన సన్నివేశాన్ని హాలీవుడ్ వాళ్లే కాపీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచారట.


బాహుబలి చిత్రం సాంకేతికంగా, కథ కథానాలపరంగా, వసూళ్ల విషయంలోనూ ఎన్నో సంచలనాలను అయితే నమోదు చేశాయి. అయితే హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది తెరకెక్కించే రాజమోళి చిత్రాల్లో వాటి ఛాయలు ఎక్కడో ఓ చోట తప్పకుండా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలను తన ఊహా శక్తితో అద్భుతంగా మలచడంలో జక్కన్న దిట్ట. బాహుబలి సినిమాలోని ఓ సన్నివేశాన్ని కూడా ఏకంగా హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారు. మళ్లీ అదేదో నార్మల్ హాలీవుడ్ సినిమా కాదు. వరల్డ్ నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ వెబ్ సిరీస్ కు 200 ఏళ్ల కథతో ప్రీక్వెల్ గా వచ్చింది హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్.


మొత్తం పది ఎపిసోడ్ లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి 9 ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పదో ఎపిసోడ్ ఈ అక్టోబర్ 24న టెలీకాస్ట్ కానుందట.. అయితే ఈ వెబ్ సిరీస్ లోని ఎనిమిదో ఎపిసోడ్ లో బాహుబలి 2 సినిమాలోని ఓ సన్నివేశాన్ని కాపీ కొట్టారు. అది కూడా మక్కీకి మక్కి దించారు. బాహుబాలి 2లో అనుష్కను అవమానించాడని సభలో సేతుపతి తల నరికే సీన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు అదే సన్నివేశాన్ని హాజ్ ఆఫ్ ది డ్రాగెన్ ఎనిమిదో ఎపిసోడ్లో వాడారు. ఈ సన్నివేశాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ విశేషం ఏంటేంట.. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకురాలు గీతా వసంత్ పటేల్ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: