జగన్ కి బాబు ఇచ్చే మొదటి పంచ్ ఇదే.!

frame జగన్ కి బాబు ఇచ్చే మొదటి పంచ్ ఇదే.!

Pandrala Sravanthi
 చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా తిరుగులేని లీడర్ గా ఎదిగారు అని చెప్పవచ్చు. ఆయన అత్యధిక మెజారిటీతో  ఏపీలో అధికారంలోకి వచ్చారు. అసలు ఇంతటి రిజల్ట్ తెలుగుదేశం కూటమికి వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు.  ఊహలకందని విధంగా ఈసారి రిజల్ట్స్ వచ్చాయి.  దీంతో చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 


ఇదే తరుణంలో జగన్ కు ఒక పంచు పడింది. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ పై మద్యం కుంభకోణం కింద  విచారణ చేపట్టనున్నారు.  ఈ విచారణలో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంటిలో సిఐడి సోదాలు నిర్వహించిందట. కానీ అక్కడ ఏం దొరికింది అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇకనుంచి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం పైన  సిఐడి సోదాలు జరపబోతున్నాయని ముందుగానే హింట్ ఇచ్చారు. 


గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి చాలా నిర్ణయాలపై సిఐడి విచారణ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అదే రివర్స్ పంచుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి  ఆయన చేసిన ప్రతి పనిపై సిఐడి విచారణ చేయించాబోతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ విధంగా ఒక ప్రభుత్వం గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్న వారిపై సిఐడి, సిబిఐ ఎంక్వయిరీలు చేయించడం  చాలా రోజుల నుంచి జరుగుతున్న తంతు. జగన్ ఐదేళ్ల పాలనలో టిడిపి నాయకుల పై ఎన్నో సిఐడి సిబిఐ విచారణలు జరిపించారు. దానికి రివేంజ్ గా  చంద్రబాబు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా చంద్రబాబు అధికారం స్వీకరించక ముందే సిఐడి విచారణలు మొదలయ్యాయి అంటే  ఇక ఆయన అధికారం చేపడితే ఎలా ఉంటుందో అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: