కన్నడలో ఎందుకు సౌందర్య ఫెయిల్ అయ్యారు.?

murali krishna
ఏందరో అభిమానుల ఆరాధ్య దేవత సౌందర్య. ఆమె తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ అందుకోలేని స్థాయికి ఆమె చేరుకున్నారు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించి ఎందరో హృదయాల్లో ఆమె చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
తెలుగు లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన కూడా ఆమె సొంత భాషలో మాత్రం ఆమె గొప్పగా సినిమాలు చేయలేదని స్వయంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అది తనకు ఎంతో లోటుగా ఉందని కూడా సౌందర్య తెలిపారు. ఆ లోటు పుడ్చుకునెందుకే తన సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించి ద్వీప అనే ఒక చిత్రాన్ని కూడా తీశారు సౌందర్య.

ఆ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా కూడా అవార్డు దక్కడం విశేషం. ఇక సౌందర్య స్వంత నిర్మాణ సంస్థ అయిన సత్యా మూవీ మేకర్ ద్వారానే ఈ చిత్రాన్ని నిర్మించింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ 22 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో మొదలైంది. కానీ అదే సమయంలో కర్ణాటక లో స్టార్ హీరో అయినా రాజ్ కుమార్ ని స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయడంతో ఓ రెండు సంవత్సరాల పాటు ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత 2002 లో మళ్లీ షూటింగ్ మొదలైంది. ఇక ఎక్కువ భాగం షూటింగ్ కర్ణాటక పట్టణానికి అతి సమీపంలో గల లింగనమ్మకి జలాశయ పరిసరాల్లో పూర్తి చేశారు.

ఇక ద్వీప సినిమా షూటింగ్ 70% వానలోనే జరగడంవిశేషం. అసలైన వానలోనే సన్నివేశాలను చిత్రీకరించడంలో కెమెరా మెన్ రామచంద్ర హల్కరే తన కెమెరా చాతుర్యాన్ని చూపించారు. ద్వీప సినిమాలో సౌందర్య కనిపించిన ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఆమె కొంత కన్నడ సినిమాల్లో నటించాలి అనే లోటును పూడ్చుకోగలిగారు. ఇక ద్వీప సినిమా డబ్బింగ్ కూడా సౌందర్య స్వయంగా చెప్పుకున్నారు. ద్వీప సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా తీయాలి అని అనుకున్నారు సౌందర్య. కథ కూడా ఓకే చేసిన తర్వాత అనుకోకుండా ఆమె కన్నుమూయడంతో ఆ కథని నందిదాస్ హీరోయిన్ గా కమ్లి అనే పేరుతో చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: