స్టార్ హీరో చేతిలో అవమానం..!

murali krishna
ఆ డైరెక్టర్ చిన్న బడ్జెట్ సినిమా లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు . కానీ పెద్ద హీరోతో సినిమాలు చేయడంలో మాత్రం ఎప్పుడు విజయం సాధించలేదు.
ఒక పెద్ద పాన్ ఇండి యా స్టార్ అతడికి ఇప్పుడు డేట్స్ ఇచ్చి నందున అతని కళ చివరకు సాకారమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును కూడా ప్రారంభించ బోతున్నారు. ఇక ఈ ప్రాజె క్టు కోసం ఒక హీరోయిన్ దర్శకు డితో పెద్ద లాభియింగ్ చేసిందని సమాచారం. ఎందుకంటే ఈ హీరోయిన్ అతనితో గతంలో రెండు ప్రాజెక్టులలో కలసి పనిచేసింది. కానీ ఇప్పుడు అల్టిమేట్ షాక్ ఇచ్చిందని చెప్పాలి స్పష్టంగా చెప్పాలంటే ఆ హీరోయిన్ ఇంత కుముందు లాక్ డౌన్ సమయంలో ఆదర్శకుడితోనే చాలా సన్నిహితంగా ఉంది . ఆమె కెరియర్ నిరాశ జనకంగా ఉన్నప్పుడు అతను ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు.
ఆ అవకాశాన్ని ఉపయో గించుకొని ఈమె ఈ పెద్ద ప్రాజెక్టు కోసం లాబీయింగ్ చేసింది. దర్శకుడు కూడా ఆమెను ఇంప్రెస్ చేయడానికి పెద్ద సినిమాలో అవకాశం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. అంతే కాదు ఏదో ఒక విధంగా ఆ స్టార్ హీరో ఆమెను అంగీకరించే విధంగా ప్లాన్ చేయా లనుకున్నారు దర్శకుడు. కానీ స్టార్ హీరో మాత్రం ఆమెను తిరస్కరించాడు. అయితే ఇదే విషయాన్ని దర్శకుడికి కూడా చెప్పారని చెబుతూ ఉంటారు. తొలిసారి అవకాశం ఇవ్వ డంతో ఇప్పుడు ఈ హీరోయిన్ విషయంలో దర్శకుడు కూడా పెద్దగా ఏమీచే యలేదని తెలుస్తోంది.
నిజానికి అవకాశాలను చేజి క్కించుకోవడా నికి దర్శకులతో సన్నిహితంగా మెలగడంలో ఈ హీరోయిన్ ఎప్పుడు పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వాలని తలచాడు. కానీ స్టార్ హీరో మాత్రం ఆమెను పూర్తిగా తిరస్కరించాడట. దీంతో ఈ హీరోయిన్ పరిస్థితి ప్రస్తుతం చతికిల బడిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: