ఎన్నో సంవత్సరాల ఆంధ్రుల అనుభందం హైదరాబాద్..!

Pulgam Srinivas
స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొంత కాలం పాటు సపరేట్ గానే ఉంది. కానీ ఆ తర్వాత కేంద్రం జోక్యంతో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ను కలిపి ఒక రాష్ట్రంగా చేశారు. అందులో భాగంగా అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది ఉండడంతో దానినే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అప్పటి కేంద్ర పెద్దలు డిసైడ్ చేశారు. దానితో హైదరాబాద్ నగర అభివృద్ధి మరింత పెరగడం జరిగింది.

మొత్తానికి హైదరాబాద్ రాజధానిగా ఉండడంతో ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అలాగే ఎక్కువ మంది ఉద్యోగాల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వచ్చారు. అలాగే పిల్లల చదువుల కోసం మరి కొంత మంది , ఇలా ఇతర పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాదు వైపే ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు.

ఇకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళ అంత ఒకే రాష్ట్రంగా ఉండాలి అని అప్పటి కేంద్ర పెద్దలు నిర్ణయించిన తెలంగాణ వారు మాత్రం మాకు సపరేట్ గా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని డిమాండ్ చేశారు. అలా ఎన్నో సంవత్సరాల డిమాండ్ తర్వాత 2014 వ సంవత్సరం వారి కల నెరవేరింది. కేంద్రం వారికి ప్రత్యేక రాష్ట్ర హోదాని కల్పించింది. ఇక అదే సమయంలో ఆంధ్ర ప్రజలకు ప్రస్తుతం రాజధాని లేదు. వారు అందువల్ల పది సంవత్సరాలు హైదరాబాదును రాజధానిగా వాడుకోవచ్చు.

అంతలోపు కొత్త రాజధానిని నిర్మించుకొండి అని సూచించారు. ఇకపోతే కొంత కాలం క్రితమే కేంద్రం ఇచ్చిన 10 సంవత్సరాలకు గడువు ముగిసి పోయింది. ఇక ఏదేమైనా ఎన్నో సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా ఉండడంతో ఆంధ్రులు హైదరాబాద్ పై ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు.  ఈ అనుబంధం మెల్లమెల్లగా తగ్గిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: