ఏపీ: తూర్పు సెంటిమెంట్ ఎవరి వైపు మొగ్గు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు గత నెల 13వ తేదీన ముగిశాయి.. ఈ నెల నాలుగో తేదీన ఫలితాలు వెలబడునున్నాయి.అలాగే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ సైతం సాయంత్రం 6 గంటల పైన రిలీజ్ చేయబోతున్నాయి. ఇప్పటికే ఎన్నో సర్వేలు ఎంతమంది జ్యోతిష్యులు సైతం ఏ ఏ పార్టీలు గెలుస్తాయని అంచనాన్ని సైతం తెలియజేశారు. అంతేకాకుండా పలు రకాల సెంటిమెంట్ సీట్లు ఉన్నాయనే విధంగా రోజు వైరల్ గా మారుతూ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా మారిపోయాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయినప్పటి నుంచి అందరి చూపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపే ఉన్నది.. ఇక్కడ ఏ పార్టీ ఇక్కడ ఎక్కువ సీట్లు సంపాదించుకుంటుందో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ కూడా ఉన్నది.. అలా 1983, 1985, 1994, 1999, 2014  లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు.. 1989, 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. 2019లో వైసీపీ పార్టీకి తూర్పుగోదావరి ప్రజలు పట్టం కట్టారు. ఈసారి 2024లో ఒకవేళ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే కచ్చితంగా  ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్పవచ్చు.

మరి ఏ పార్టీకి తూర్పుగోదావరి ప్రజలు అనుకూలంగా ఓటు వేశారని విషయం జూన్ 4వ తేదీన తెలియబోతోంది. ఇప్పటికే చాలామంది బెట్టింగ్ రాయల్ కూడా ఎవరు అధికారంలోకి వస్తారని విషయం పైన అటు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని విషయం పైన బెట్టింగ్ వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా ఉత్కంఠ పరిచయాలు చేస్తోంది. అయితే అధినేతలు మాత్రం ఎవరి ధీమాతో వారు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున సీఎం జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడం జరిగింది. దీంతో నేతలతో మాట్లాడిన తర్వాత ఏం చెబుతారని విషయంపైన ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: