ముగిసిన విదేశీ పర్యటన.. ఏపీకి చేరుకున్న జగన్.. పొలిటికల్ యాక్షన్ షురూ..!

lakhmi saranya
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఈనెల 28వ తేదీన లండన్కు వెళ్లిన జగన్ ఇవాళ అనగా మే 1వ తారీకు ఉదయం తిరిగి విజయవాడకు చేరుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్కు వైసిపి నేతలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు.
అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దీంతో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తుంది. పోలింగ్ అనంతరం రెస్ట్ మైండ్ లోకి వెళ్లి నేతలు కౌంటింగ్ వేలా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే పరస్పరం కౌంటర్లు, విమర్మలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరిగింది.
ఇక ఇదిలా ఉంటే కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేల వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో రెండు రోజుల క్రితం ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రజా దీవెనలతో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని రాసుకొచ్చారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున వైసిపి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. " దేవుడి దయ మరియు ప్రజలు ఇచ్చిన చారిత్నాత్మక తీర్పుతో సరిగా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సంగ్రాభివృద్ది దిశా గా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది " అని వైసిపి జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: