బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఆది పురుష్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని 3డీలో రూపొందించగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథాలజికల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆ విధంగా ఈ సినిమాకు భారీ తారాగణం నటించడం ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఏర్పడడానికి ఈ కారణం అవుతుంది అని చెప్పాలి.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇప్పుడు మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అయోధ్యలో విడుదల చేసి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగేలా చేసింది చిత్ర బృందం ఆ విధంగా ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే.
అయితే తాజాగా జరిగిన ఓ పరిణామం ఇప్పుడు దేశమంతటా అందరినీ ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది. ఈ సినిమా దర్శకుడికి నిర్మాత భూషణ్ కుమార్ ఒక కారును గిఫ్ట్ గా ఇవ్వడం సంచలన విషయం గా మారింది. సినిమా ఔట్ పుట్ పట్ల ఎంతటి కాన్ఫిడెంట్ గా లేకపోతే నాలుగున్నర కోట్ల విలువ చేసే కారుని ఆయనకు బహుమతిగా ఇస్తాడు అని ప్రభాస్ అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ తప్పకుండా అవుతుందని కాలర్ ఎగరేసుకొని మరి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. టీజర్ విడుదలైన తరువాత దర్శకుడు పై చాలామంది ప్రభాస్ అభిమానులు ఎటాక్ చేసారు. ఆ టీజర్ ఆ విధంగా కట్ చేయడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు మరి అవుట్ ఫుట్ ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.