బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఓటీటీ వేదికగా సాగుతున్న ఈ షో కు బాలయ్య సినీ, రాజకీయ ప్రముఖులను తీసుకొచ్చారు.వారి గురించి అనేక ప్రశ్నలు వేసి ప్రేక్షకులకు వినోదాన్ని తెప్పించారు. కొందరు ఈ షో కు రావాలని పట్టుబడుతున్నారు. కానీ బాలయ్య ప్లాన్ ప్రకారంగా గెస్టులను పిలుస్తున్నారు. 'అన్ స్టాపబుల్ -1'లో సినీ ప్రముఖులను మాత్రమే పిలిచారు. రెండో సీజన్ లో ఎక్కువగా రాజకీయ నాయకులనే పిలుస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబునాయుడుని ప్రొగ్రాంకు పిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తనతో సమానమైన నటుడు అక్కినేని నాగార్జున మాత్రం ఇంతవరకు రాలేదు. దీంతో అసలు నాగార్జున రాకపోవడానికి కారణమేంటి..? అని చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణలతో అక్కినేని నాగార్జున కూడా సమానమైన నటుడు. వీరి దశకంలో ఒకరికంటే మరొకరు పోటీ పడి సినిమాలు తీశారు. ఈ నలుగురూ ఇప్పటికీ సినిమాల్లో కొనసాగడం విశేషం. అశేష ప్రేక్షకులను అలరించే బాలయ్య తోటి నటులతో ఎలాంటి వివాదం లేకుండా కొనసాగుతారు. ఈ నేపథ్యంలోనే ఈ షోకు మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటికే తీసుకొచ్చారు. వెంకటేశ్ ను కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అయితే అక్కినేని నాగార్జునను కూడా ఈ షో కు రావాలని అడిగారట. కానీ ఆయన ఒప్పుకోలేదట.అన్ స్టాపబుల్' షో లో బాలయ్య పర్సనల్ విషయాలపై టార్గెట్ పెట్టారు. ఆయన వేసే కొన్ని ప్రశ్నలకు తప్పక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ షో కు అటెండ్ అయితే బాలయ్య తప్పకుండా నాగచైతన్య, సమంతల గురించి అడుగుతాడు. అప్పుడు ఎలాటి సమాధానం ఇచ్చినా వివాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ షో కు దూరంగా ఉండడమే బెటరని నాగ్ ఆలోచిస్తున్నాడట. ఇక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న నాగ్ ఈ షో లో పాల్గొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. నాగ్ నటించిన సినిమాలూ వరుసగా ప్లాప్ కావడంతో నిరాశలో ఉన్న అయన ప్రొగ్రాంకు రాలేకపోతున్నట్లు సమాచారంమరోవైపు నాగ్ 'బిగస్ బాస్ 6' నాగ్ హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. 5 షో లు విజయవంతంగా పూర్తి చేసినా.. 6 సీజన్ కు అనుకున్న రేటింగ్ రావడం లేదట. దీంతో ఈయన తీవ్ర మనస్థాపంగా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో 'అన్ స్టాపబుల్' కు వచ్చి బాలయ్య అడిగే ప్రశ్నలకు తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడం అని కామ్ గా ఉన్నాడట. అయితే బాలయ్య పిలిస్తే జూనియర్ వెంటనే పరుగెత్తుకుని వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన విషయంలో ఎలాంటి రియాక్షన్ లేదట. దీంతో ఆయన ఎప్పుడోస్తాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.