విడాకులు రద్దు.. కొత్త ఇంట్లోకి మారనున్న ధనుష్, ఐశ్వర్య.. ఇంటి ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా..?

Anilkumar
కోలీవుడ్‌ మాజీ దంపతులు ధనుశ్‌-ఐశ్వర్య రజనీకాంత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో వీరిద్దరి విడాకుల విషయం సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుండగా ఇక ఇప్పుడు  మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే  ఈ ఏడాది జనవరిలో విడిపోయామని ధనుశ్‌-ఐశ్వర్యలు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇక  ఇప్పుడు తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. 

కాగా పిల్లల కోసం వీరిద్దరు వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఇక  దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ధనుశ్‌ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ఇకపోతే ధనుశ్‌కు తన పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విడాకులు ఈ వార్తలపై స్పందించాడు. ఇక దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట ఫాలోవర్స్‌ సంబరపడిపోతున్నారు.అయితే  ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక  ధనుశ్‌ ఓ కొత్త ఇంటిని కొనుగొలు చేస్తున్నాడని, విడాకులు రద్దు ప్రకటన ఆనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ధనుశ్‌ ఖరీదు చేయబోయే ఆ ఇంటి విలువ రూ. 100 కోట్లని, వచ్చే ఏడాది జనవరిలో భార్య, పిల్లలతో గృహ ప్రవేశం కూడా చేయబోతున్నాడంటూ తమిళ మీడియా, వెబ్‌సైట్లలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.  ఈ వార్తలు నిజమైతే బాగుండని, మళ్లీ వారిద్దరు కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.  2004 నవంబర్‌ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ధనుశ్‌-ఐశ్వర్యలకు యాత్రా రాజా (15 ), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: