నాగార్జున వల్లే అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఇండస్ట్రీ లో ఎదగడం లేదా..!!
దానికి అతి పెద్ద కారణం నాగార్జున అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని కుటుంబానికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు అలాంటి గౌరవాన్ని తన కుటుంబానికి ఇండస్ట్రీలో సంపాదించి పెట్టారు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే నాగార్జున తన తండ్రి పేరును రెట్టింపు చేసేలా తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున వారసుడిగా వచ్చిన అక్కినేని నాగచైతన్య, అఖిల్ మాత్రం ఆ స్టేటస్ ని ఎప్పటికీ అందుకోలేక పోతున్నారు. చాలామంది తాతలు తండ్రుల పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంటే నాగచైతన్య, అఖిల్ లు మాత్రం తమ కెరియర్ ని ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నారు.వారు ఎన్ని సినిమాలు చేసినా వారికి సరైన హిట్టు దొరకడం లేదు. ఇక అఖిల్ నాగచైతన్య మాత్రమే కాకుండా సుమంత్, సుశాంత్ లు కూడా ఈ జాబితాలోకే వస్తారు. వీళ్లు కూడా అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చారు.కానీ వీళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఇక ఈ నలుగురు ఇండస్ట్రీలో హీరోలుగా పేరు తెచ్చుకోపోవడానికి ప్రధాన కారణం నాగార్జున వారిపై ఆసక్తి చూపించకపోవడం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే నాగార్జున లాంటి స్టార్ హీరో తలుచుకుంటే వీరిని హీరోలుగా చేయడం పెద్ద పనేమీ కాదు. కానీ కోట్ల ఆస్తి ఉన్నా కూడా నాగార్జున ఆ పనిచేయడానికి పూనుకోవడం లేదు. ఇది నిజంగా నాగార్జున కర్మ అని చాలా మంది నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా లేట్ చేయకుండా నాగార్జున తన కొడుకుల ఫ్యూచర్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.