'వర్ధరాజ మన్నార్‌'గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌.. ఆసక్తికరంగా 'సలార్‌' పోస్టర్‌...!!

murali krishna
ఈ మధ్య కాలంలో మలయాళ హీరోలు ప్రతి భాషలో వాళ్ళ మార్కెట్‌ను పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్‌ తెలుగులో మంచి మార్కెట్‌ క్రియేట్‌ చేసుకోగా..ఇప్పుడు మలయాళ స్టార్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన పేరు దక్షిణాదిన మర్మోగిపోతుంది. ఈ మధ్య కాలంలో మలయాళ హీరోలు ప్రతి భాషలో వాళ్ళ మార్కెట్‌ను పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్‌ తెలుగులో మంచి మార్కెట్‌ క్రియేట్‌ చేసుకోగా.. ఇప్పుడు మలయాళ స్టార్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన పేరు దక్షిణాదిన మర్మోగిపోతుంది. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘కడువా’ తెలుగులో కూడా రిలీజై మంచి విజయం సాధించింది. కాగా గత కొంత కాలంగా ఈయన ప్రభాస్‌ ‘సలార్‌’లో ఓ కీలకపాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే చిత్రబృందం ఈ విషయంపై డైరెక్ట్‌గా ఎప్పుడూ చెప్పలేదు.
కాగా ఆదివారం ఈయన పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ బర్త్‌డే విషెన్‌ను తెలియజేసింది. ఈ చిత్రంలో పృథ్విరాజ్‌ ‘వర్ధరాజ మన్నార్‌’గా నటించనున్నాడు. రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. పోస్టర్‌ను గమనిస్తే పృథ్విరాజ్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
అవుట్ అండ్‌ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు తండ్రి, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమచారం. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. కాగా ఈ సినిమా టీజర్‌ను దీపావళికి గాని, ప్రభాస్‌ బర్త్‌డేకు గాని రిలీజ్‌ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: