ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో అందరి చేత ట్రోల్ కి గురవుతున్నాడు హీరో మంచు విష్ణు. తెలుసో తెలియకో కొన్ని మాటలు ఆయన ప్రేక్షకుల ముందు చెప్పడంతో దానిని కొంతమంది యూట్యూబర్స్ ట్రోల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయనపై కొన్ని వేల వీడియోలు యూట్యూబ్ లో దర్శనమిచ్చాయి. అవన్నీ కూడా ఆయన పరువు మర్యాదలను తీసి పడేసే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వాటి మీద పోరాటంగ మంచు విష్ణు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించడం జరిగింది.
త్వరలోనే ఆ వీడియోలకు సంబంధించిన వారిని ప్రశ్నించి దీని వెనక ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని కనిపెట్టబోతున్నామని మంచు విష్ణు చెప్పడం కొన్ని వీడియోలు తగ్గడానికి కారణం అయ్యింది అని చెప్పవచ్చు. ఈ సమస్య ఇప్పుడిప్పుడే సమసి పోతుంది అని అనుకుంటుంటే ఇప్పుడు తాజాగా ఆయన మరొక వివాదంలో ఇరుక్కున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు మంచు విష్ణు ను సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.
దానికి కారణం మంచు విష్ణు ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ బాగోలేదు అని చెప్పడమేనని వారు చెబుతున్నారు. ప్రేక్షకులను మోసం చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ను ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటలను అన్నారని కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ తో తనకు మంచి స్నేహం ఉందని ఇలాంటి కల్పించి చెప్పడం అంత మంచిది కాదని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఇలాంటి విమర్శలను మంచు విష్ణు గతంలో ఎప్పుడు చేసింది లేదు. కాబట్టి దీని వెనకాల మంచు విష్ణు హస్తం లేదని చెప్పాలి. ఎవరో కావాలని తన పై ఇలాంటి ఆరోపణలు చేయడం తనకు బాధాకరంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జిన్నా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.