పండుగ సీజన్ లో సినిమాలు విడుదల చేయడం అంటే నిర్మాతలకు ఎంతో ఇష్ట మైన పని. ఎందుకంటే ఆ సీజన్లో ప్రేక్షకులందరూ కూడా సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తాయి కా బట్టి పండుగ సమయాలలోనే తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇప్పటిదాకా చాలామంది హీరోలు పండుగ సమయాలలో ఇతర హీరోలతో పోటీపడి తమ సినిమాల ద్వారా భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్నారు.
ఆ విధంగా వచ్చే ఏడాది రాబోయే సంక్రాంతికి తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సిని మాలే ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అందులో అగ్ర హీరోల సినిమాలు ఉండడం మరింత విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాం తికి విడుదల చేయాలని భావిస్తూన్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్ష కుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా ఈ సినిమా సంక్రాంతికి రావడమే ఖాయం అని చెబుతున్నారు.
ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న వారసుడు సినిమా ను కూడా సంక్రాంతికి బరిలోకి దింపనున్నారు. విజయ దళపతి హీరోగా నటిస్తూ ఉండగా ఈ సినిమా లో రష్మీక హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ చిత్రం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విధంగా ఈ మూడు పాన్ ఇండియా సినిమాలు ఒకే సీజన్ లో ఒకే రోజున ప్రేక్షకులకు రావడం ఎంత వరకు సినిమా పరిశ్రమకు మంచిదో తెలియాల్సి ఉంది.