పవన్ భవదీయుడు పక్కన పెట్టినట్లే!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా నటి స్తున్న హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. చాలా రోజుల బ్రేక్ తర్వాత ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వచ్చే ఏడాది విడు దల చేసే విధంగా రంగం సిద్ధం చేసుకు న్నాడు. క్రిష్ దర్శకత్వం లో రూపాందుతున్న ఈ సినిమా చారితాత్మక నేపథ్యం లో తెరకెక్కుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తొలిసారిగా తమ అభిమాన హీరో ఇలాంటి జోనర్ లో నటిస్తూ ఉండడం వారిలో ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ ఒకేసారి చాలా సినిమాలను అప్పట్లో సెట్స్ మీదకు తీసుకువెళ్లడం ఒకసారిగా పవన్ అభిమానులు సంతోషాన్ని కలగ జేసింది. అయితే వాటిలో ఏ సినిమా చేస్తాడు అన్న క్లారిటీ లేకపోవడం ఇంకొక వైపు వారిలో నిరాశను కూడా కలుగ జేస్తుంది. ఒప్పుకున్న సినిమాలను మొదలు పెట్టాలని చూసి న పవన్ కళ్యాణ్ ఇంకా ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం అసలు ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను కలుగజేస్తుంది. దాదాపు రెండేళ్లుగా నిరీక్షణ చేస్తున్న హరిశంకర్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది.

త్వరలోనే ఈ సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూ డా రావటం లేదు. దాంతో హరీష్ శంకర్ మరొక హీరో తో సినిమా చేయడానికి ముందుకు వెళ్ళాడు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో అక్క డ ఎలక్షన్ ప్రచారం చేయడానికి సిద్ధం అయిపోతు ఉన్నాడు. ఈ నేపధ్యంలో భగత్ సింగ్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: