నా రూల్స్ నా ఇష్టం అంటున్న సాయి పల్లవి..!!

murali krishna
టాలీవుడ్  స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్  ఎక్కువ గానే ఉంది. అయితే సాయిపల్లవి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
తాజాగా సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫిదా, లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలలో సాయిపల్లవి అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు సాయి పల్లవి . గార్గి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే కథ, పాత్రల ఎంపిక గురించి సాయిపల్లవి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏదైనా రోల్ ను ఇదే విధంగా చేయాలని రూల్ పెట్టుకోనని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. సినిమాలో చేసే రోల్ కోసం నేను ముందుగానే సన్నద్ధం కానని సాయిపల్లవి కామెంట్లు చేశారు. తోటి నటీనటులు, సెట్ వాతావరణంపై ఆధారపడి నా నటన ఉంటుందని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. నా రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తానని సాయిపల్లవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించి మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు సాయిపల్లవి ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సాయిపల్లవి వరుసగా సినిమాలలో నటించాలని, స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కెరీర్ విషయంలో సాయిపల్లవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు ఎప్పుడు వెలువడతాయో మనం చూడాల్సి ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: