టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ తగ్గలేదు.. ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇటీవల విడుదలైన లైగర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల రిలీజ్ అయ్యింది.విజయ్ లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమణ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా లైగర్ ప్లాప్ కారణంగా ఆగిపోయింది.. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న
ఈ సినిమా లైగర్ డిజాస్టర్ తట్టుకోలేక ఆగిపోయింది. ఇదిలావుంటే ప్రెజెంట్ విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ .. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఇకపోతే కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాల కంటే ముందే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.. మరి ఈ సినిమా కూడా అటకెక్కినట్టే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక సాయుధ పోరాట నేపథ్యంలో భారీ పీరియాడిక్ సినిమా చేయడానికి
సైకుమార్ ప్లాన్ చేసాడు.ఇకపోతే 2021లోనే ప్రకటించిన ఈ సినిమాను 2022లో సెట్స్ మీదకు తీసుకు వెళతాం అని ప్రకటించినా ఇప్పటికి కూడా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు.. సుకుమార్ ప్రెజెంట్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు.ఇక దీంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కే అవకాశం లేదు.. ఈ సినిమా కూడా అటకెక్కినట్టే అని వార్తలు వస్తున్నాయి.. అయితే మరి విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఏ సినిమాలను అయినా ప్రకటిస్తాడో లేదో చూడాలి..!!