కాస్టింగ్ కౌచ్ పై.. విష్ణుప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎప్పుడూ తెర మీదికి వచ్చిన ఎంతో సంచలనం గా మారి  పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఇక ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కెరియర్ మొదట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియ జేస్తూ సోషల్ మీడియా లో ఎన్నో నిజాలు బయట పెట్టి సంచలనమే సృష్టించారు అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఇటీవలి కాలం  లో ఎప్పుడూ సోషల్ మీడియా లో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం వైరల్ గా మారి పోతుంది  అన్న విషయం తెలిసిందే.


 కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటి వరకు ఎంతో మంది నెగిటివ్ కామెంట్లు చేస్తే ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటివి తప్పదని కెరియర్ లో ఎలా ముందుకు వెళ్లాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది అని మరి  కొంతమంది భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బుల్లితెరపై యాంకర్గా గుర్తింపు సంపాదించుకునీ ఇక ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్న యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే కాదు ఎక్కడైనా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.


ఏ వృత్తి లో నైనా మహిళలు లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా  తాను పనిచేసిన ప్రతి చోట మహిళ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాస్టింగ్ కౌచ్ అనేది  కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన మాటగా దీనిని పరిగణించడం తప్పు అంటూ తెలిపింది. అయితే తనకు క్యాస్టింగ్ కౌచ్ లో ఎలాంటి అనుభవం కలగలేదు అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. కాగా ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: