ఇన్నేళ్లలో నా భర్త ఒక్కసారి కూడా అలా చేయలేదు : కుష్బూ
ఇటీవలి కాలంలో ఎన్నో కేజీల బరువు తగ్గి చివరకు ఎంతో స్మార్ట్ గా మారిపోయింది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు జబర్దస్త్ లో జడ్జి అవతారమెత్తింది అన్న విషయం తెలిసిందే. కాగా ఇక తనదైన జడ్జిమెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు తన నవ్వుతో కూడా ఎంతో మంది మనసు కొల్లగొడుతుంది అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ హీరోయిన్ కుష్బూ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
మీది కూడా లవ్ మ్యారేజేనా మేడం అంటూ అడుగుతాడు రాకింగ్ రాకేష్. అవును అని చెబుతుంది కుష్బూ. అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి అని అడుగుతాడు రాకేష్. మొదటి సినిమా సమయంలోనే నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేశాడు. ఇక అప్పుడు నేను కూడా ఒప్పుకున్నా అంటూ చెబుతుంది. అయితే 28 ఏళ్ళ దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు తన భర్త ఒక్కసారి కూడా తనకు ఐలవ్యూ చెప్పటం చేయలేదని ఒక విషయం చెబుతుంది ఖుష్బూ. దీంతో ఇప్పుడు ఆయనకు కాల్ చేసి అడగండి అని చెప్పగానే వెంటనే కాల్ చేసి మాట్లాడుతుంది. దీంతో ఎంతో తెగ సిగ్గు పడి పోతుంది.