తాప్సి వేసిన ప్రశ్నకు.. రిపోర్టర్ మైండ్ బ్లాక్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలు అన్న తర్వాత ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం రిపోర్టర్ ల నుంచి అటు సినీ సెలబ్రిటీలు ఊహించని రీతిలో షాకింగ్ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు నవ్వుతూ కనిపించే సెలబ్రిటీలు ఆగ్రహానికి గురవడం లాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు హిందీ తమిళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఢిల్లీ భామ తాప్సీ పన్ను.


 తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అటు బాలీవుడ్లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది అని చెప్పాలి. ఇకపోతే ఎప్పుడు స్వీట్ గా మాట్లాడుతూ క్యూట్ గా కనిపించే తాప్సీ ఇటీవల రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మాత్రం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రిపోర్టర్లు ప్రశ్నలు అడగడం కాదు ఇక తన ప్రశ్నలతో రిపోర్టర్ కి చుక్కలు చూపించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 తాప్సి ఇటీవలే దొబారా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న తాప్సి ఈ సందర్భంగా రిపోర్టర్లకు ముందుగానే ఒక విన్నపం చేసింది. ప్రశ్న అడిగే ముందు దానిపై కొంత పరిశోధన చేయండి అంటూ చెప్పింది. ఈ క్రమంలోనే దొబారా సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్ పై రిపోర్టర్ ప్రశ్నించాడు. అయితే ఏ సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్ లేదో చెప్పాలి అంటూ రిపోర్ట్ ని అడిగింది.  నెగిటివ్  క్యాంపెయిన్ లేని సినిమా ఏదో చెబితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అంటూ చురకలు అంటించింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: