మల్లెమాల.. ఆ ఇద్దరు కమెడియన్స్ కి ద్రోహం చేస్తోందా?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కామెడీ షోస్ ప్రసారం అవుతూ ఉన్నప్పటికీ ఇక బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న షో ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పేది మాత్రం జబర్దస్త్. ఎన్నో ఏళ్ల నుంచి తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ఇటీవల కాలంలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ఎంతోమంది అప్కమింగ్ కమెడియన్స్ కి జబర్దస్త్ లైఫ్ ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎంతోమంది టాలెంట్ ఉన్న వారికి మంచి అవకాశాలు ఇస్తూ పాపులారిటీ తెచ్చిపెడుతుంది. ఈ కార్యక్రమం లోనే ఎప్పటికప్పుడు జబర్దస్త్ లో కొత్త కమెడియన్స్ దర్శనమిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ యాజమాన్యం ఇద్దరు విషయంలో మాత్రం కాస్త వివక్ష పూరితంగా  వ్యవహరిస్తుంది అన్న టాక్ మాత్రం ప్రస్తుతం వినిపిస్తుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైన ఇమ్మానియేల్, నూకరాజు. ఇద్దరు  చాలా రోజులనుంచి జబర్దస్త్ లో కొనసాగుతున్నారు.ఇక వీరిద్దరి టాలెంట్తో మంచి మార్కులు కూడా కొట్టేశారు.


 పాపులారిటీ కూడా సంపాదించారు.  ఇలా గుర్తింపు వస్తే   వారికి టీం లీడర్ పదవి కట్టబెడుతూ ఉంటుంది మల్లెమాల. కానీ ఇమ్మానియేల్, నూకరాజు ఇప్పటివరకు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారికి టీం లీడర్ గా అవకాశం మాత్రం ఇవ్వలేదు. హైపర్ ఆది చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సుడిగాలి సుదీర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. జబర్దస్త్ లోనే ఉంటూ ఎంతో కాలంగా కొనసాగుతున్న వారికి టీం లీడర్ పదవి ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఇద్దర్నీ మాత్రం మల్లెమాల యాజమాన్యం పట్టించుకోవడం లేదు అనేది తెలుస్తుంది. దీంతో ఎంతో మంది మల్లెమాల యాజమాన్యం పై విమర్శలు కూడా చేస్తున్నారు. నిజంగానే మల్లె మాల వీరిద్దరికి అన్యాయం చేస్తోంది అంటూ అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: