'ఓటిటి' విడుదలకు సిద్ధం అయిన విక్రమ్ 'కోబ్రా' మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరియర్ ప్రారంభంలో తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విక్రమ్ ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఆసక్తిని చూపించాడు . అందులో భాగంగా అనేక విజయ వంతమైన తమిళ సినిమాల్లో నటించిన విక్రమ్ ప్రస్తుతం కొల్లువుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యింది.
 


ఈ మూవీ లో కే జి ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా , అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన కోబ్రా మూవీ తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోన్నే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలుబడింది. ఈ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో మరి కొన్ని రోజుల్లో ప్రసారం కానున్నట్లు సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: