బిగ్ బాస్ 6 : వచ్చేవారం బయటకు వచ్చేది ఆమేనా?

praveen
ప్రేక్షకులందరూ ఎదురుచూసిన బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 21 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక తమ వ్యూహాలకు పదును పెడుతూ బయట ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఇస్తున్న టాస్క్ లతో మొదటి వారంలోనే హౌస్ మొత్తం రణరంగంగా మారిపోయింది అని చెప్పాలి. ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకోవడం కూడా మొదలు పెట్టారు అని చెప్పాలి. 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ అటు గీతూ రాయల్ మాత్రం కెమెరాలా దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండటం గమనార్హం.


 యూట్యూబర్గా, ఐటి ఉద్యోగిగా రివ్యూవర్గా  ఆర్టిస్ట్ గా రాణిస్తుంది గీతూ రాయల్.  ఇటీవల కాలంలో ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో  సందడి చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ కాస్త ఓవరాక్షన్ చేస్తుందని ఎక్కువ రోజులు హౌస్లో కొనసాగలేదు అని నెటిజన్లు అనుకుంటున్నారు. బయట గీతూ రాయల్ గురించి ప్రేక్షకులందరికీ ఒక భావన ఉంది.  కానీ హౌస్ లో మాత్రం చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆమె.  ఆమె ఓవరాక్షన్  చూడలేక కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఆమెను జైలుకు కూడా పంపించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ వారంలో ఆమె నామినేషన్స్  లో లేదు. ఇప్పుడు సేవ్ అయినట్లే. అయితే వచ్చే వారం నామినేషన్ కు వస్తే మాత్రం గీతూ రాయల్ కథ ముగిసినట్లే అంటున్నారు ఎంతో మంది నెటిజన్లు.


 ఇకపోతే ఇటీవలే  హోస్ట్ నాగార్జున సైతం గీతూ రాయల్ ప్రవర్తనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు అన్న విషయం తెలిసిందే.  కాగా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎంతోమంది టిక్ టాక్ స్టార్స్, బుల్లితెర  కమీడియన్స్,యూట్యూబర్లు, సీరియల్ ఆర్టిస్ట్ లు  కంటెస్టెంట్స్ గా  ఎంట్రీ ఇచ్చారు.  ఇక వీరందరిలో ఆదిరెడ్డి, గలాటా గీతూ, సింగర్ రేవంత్  మీద విపరీతమైన పోటీ పెరిగిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: