పూరీ జగన్నాధ్ ఆ విషయం పై ఫోకస్ చేయాలి!!

P.Nishanth Kumar
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను పెద్దగా అలరించడం లేదు. ఒకప్పుడు అగ్ర దర్శకుడుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను శాసించిన ఈ దర్శకుడు ఇప్పుడు ఈ విధంగా అయిపోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. ఆ మధ్య ఆయన రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప మరేదీ కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.

ఆ సినిమాలు మంచి కాన్సెప్ట్ ఉండడంతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అవుట్ కావడంతో అది ప్రేక్షకులను అలరించగలిగింది. అలా ఆ తర్వాత చేసిన లైగర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన కూడా అది వారిని ఏమాత్రం అలరించలేకపోయింది. ఫలితంగా ఒక భారీ ఫ్లా ప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు పూరీ జగన్నాథ్. ఏదేమైనా ఒకప్పుడు పూరీలో ఉన్న స్టామినా ఇప్పుడు లేదని స్పష్టంగా తెలుస్తుంది. కథల పట్ల ఆయనకు ఉన్న పట్టు ఇప్పుడు సడలినట్లుగా తెలుస్తుంది. 

అయితే అభిమానులు ఈ దర్శకుడు ఎప్పుడు మంచి కం బ్యాక్ చేస్తాడో అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి కూడా ఈ విధంగా నిరాశపరచడం పూరి జగన్నాథ్ పై ఉన్న అభిమానం చాలామందికి తగ్గిపోతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రం ద్వారానైనా పూరి జగన్నాథ్ మునుపటి పూరీని బయటకు తీసుకు వస్తాడా అనేది చూడాలి. ముందుగా కథపై ఫోకస్ పెట్టి దానిని ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్ది సినిమా చేసి ఆ తర్వాత దాంతో విజయాన్ని అందుకోవాలి అనేది ఆయన అభిమానులు చెబుతున్న మాట. మరి ఇప్పటికైనా పూరీ జగన్నాధ్ మారి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు చేసి హిట్ సాధించి మునుపటి పూరీ జగన్నాద్ లా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: