బాలీవుడ్ లో మన హీరో లకు ఆఫర్స్ పెరిగిపోతున్నాయా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమా అవకాశాలు అందుకోవడం జరుగుతుంది. ఇది టాలీవుడ్ హీరోలు సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమా చేయాలని ప్రతి ఒక్క భారతీయ నటుడు కూడా భావిస్తూ ఉంటాడు.

 ఆ విధంగా అంత పెద్ద బాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరో గా సినిమా చేయడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమంలోని కొంతమంది హీరోలు ఈ అరుదైన అవకాశం అందుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇలాంటి అవకాశం అందుకోవాలంటే భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొంది ఉండాలి. ఆ విధంగా టాలీవుడ్ సినిమా హీరోలు బాలీవుడ్ సినిమా అవకాశాలు అందుకోవడం విశేషం.

తాజాగా మరొక హీరో ఈ జాబితాలో చేరినట్లు అయ్యింది. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో నిఖిల్ బాలీవుడ్ లో కూడా ఈ సినిమాతో మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేయడానికి ప్రముఖ బాలీవుడ్ కంపెనీలు ఇప్పుడు క్యూలు కడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఏ స్థాయి హీరోగా ఎదుగుతాడో చూడాలి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఈ హీరో ఫుల్ జోరుగా ఉన్నాడు. ఆ చిత్రాలు మంచి సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను ఏర్పరుచుకోవడం ఖాయం. ఇప్పుడు ఆయన స్పై అనే మరొక పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఆయనకు ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: