బాలీవుడ్ ఫిలిమ్ క్రిటిక్ గా చెప్పుకోని ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగే కమల్ ఆర్ ఖాన్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన తనకు తానే ఫిలిమ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ పలు సినిమాలకు రివ్యూ ఇస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు తెరతీస్తుంటాడు.ఇక ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోల సినిమాల గురించి వివాదాస్పదమైన రివ్యూలు స్వీట్లు చేయడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఇతడు తాజాగా మరోసారి కాంట్రవర్సీ ట్వీట్ చేయటం ద్వారా ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ 2020 సంవత్సరంలో చేసినది కావడం విశేషం.ఇలా గతంలో చేసిన ఈ ట్వీట్ విషయంపై కేసు ఫైల్ కావడంతో ముంబై పోలీసులు మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. కమల్ 2020 వ సంవత్సరంలో ఇర్ఫాన్, రిషి కపూర్ ల గురించి పలు ట్వీట్స్ చేశాడు. దీంతో యువసేన సభ్యుడు రాహుల్ కనల్ కమల్ ఆర్ ఖాన్ పై మలాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా గతంలో కమల్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ప్రస్తుతం పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే నేడు కెఆర్కెను బోరివలి కోర్టులో హాజరు పరచనున్నారు.అయితే ఇతడు తరచూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.ఇలా గతంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీల విషయంపై పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచాడు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కెఆర్కెను నేడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు.హిందీ బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఈయన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడని చెప్పాలి. ఇకపోతే ఈయన ఎన్నోసార్లు స్టార్ సెలబ్రిటీలపై ఇలాంటి అసభ్యకర పదజాలంతో ట్వీట్లు చేస్తూ ఉండటంతో ఇది సరైంది కాదని భావించిన రాహుల్ కనకల్ ఆయనపై కేసు నమోదు చేశాడు.ఇక గతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై కూడా చాలా దారుణంగా తిడుతూ నెగటివ్ రివ్యూ ఇచ్చాడు.