భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విక్రమ్ 'కోబ్రా' మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన చియాన్ విక్రమ్ గురించి ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించిన విక్రమ్ ఆ తర్వాత ఎక్కువగా కోలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడు మూవీ తో విక్రమ్ తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అదిరిపోయే క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.


ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ 'కోబ్రా' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విక్రమ్ సరసన కే జీ ఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 31 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు.


ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను కూడా పెంచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ని కూడా మూవీ యూనిట్ లాక్ చేసింది. ఈ 3 గంటల 3 నిమిషాల 3 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: