అనన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ...!!

murali krishna
నేను హీరోని, ఎప్పటికీ హీరోనే, ఎన్నేళ్లు వచ్చినా హీరోనే.. అందరూ నన్ను జీవితాంతం గుర్తుంచుకోవాలి అనుకుంటూ ఉంటారు మన హీరోలు అందరూ.. అంతలా తమను తాము హీరోలం అని అనుకుంటూ ఉంటారు.


అయితే 'రౌడీ' స్టార్‌ విజయ్‌ దేవరకొండ మాత్రం సగటు హీరోకు భిన్నంగా స్పందించాడు. కెరీర్‌ ముగింపు దశకు వచ్చే సమయంలో.. ప్రేక్షకులందరూ తనను మర్చిపోవాలని విజయ్‌ దేవరకొండ కోరాడట.. 'లైగర్‌' విడుదల సందర్భంగా  తమ సినిమాను ప్రమోట్‌ చేస్తూ అలా మాట్లాడాడు.


సినిమా వాళ్లు తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడానికి అన్ని అవకాశాలను వాడేసుకుంటూ ఉంటారు. అందులో సోషల్‌ మీడియాలో అయితే కీలకం. తాజాగా 'లైగర్‌' గురించి కూడా ఇలానే  హ్యాండిల్‌ వేదికగా ప్రచారం చేశాడు. సినిమాకు సంబంధించి, తమకు సంబంధించి అభిమానులు అడిగారు అంటున్న ప్రశ్నలకు సమాధానాలిచ్చారు విజయ్‌, అనన్య పాండే. ఈ సందర్భంగా అనన్య పాండే మాట్లాడుతూ.. విజయ్‌లో నాకు నచ్చని విషయం ఒకటుంది.



ర్యాపిడ్‌ ఫైర్‌ కానీ, Q and A సెషన్‌ వస్తే.. తొలుత నన్నే స్టార్ట్‌ చేయమంటాడు విజయ్‌. ఈ విషయం నాకు అస్సలు నచ్చదు అని చెప్పింది. ఇక నచ్చేది కూడా చెప్పు అని అడిగితే.. అతను ప్రేమించే ప్రతి ఒక్కర్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పుకొచ్చింది. విజయ్‌ని ఇదే మాట అడిగితే.. ''అనన్య ఎప్పుడూ ఏదో ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో ఆమె నాకు నచ్చదు. ఇలాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఏం చేయాలో అని భయమేస్తోంది కూడా'' అని అన్నాడట.



ఇక అనన్యలో నచ్చే లక్షణం ఏంటి అంటే.. ''ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటుంది'' అని చెప్పాడు విజయ్‌. ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ''నా కెరీర్‌ ముగింపు దశకు వచ్చేసరికి నన్నెవరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోవడం లేదు. దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు ఎంజాయ్‌ చేయండి'' అని చెప్పాడట విజయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: